ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 91.55.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ tnresults.nic.inలో చూసుకోవచ్చు.

10వ తరగతి పదో తరగతికి సంబంధించి రాష్ట్ర బోర్డు పరీక్షలు మార్చి 2 నుంచి ఏప్రిల్ 8 మధ్య జరిగాయి.

పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 4,107 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మొత్తం 9,10,024 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 4,57,52 మంది బాలురు, 4,52,498 మంది బాలికలు ఉన్నారు. ఒక ట్రాన్స్‌జెండర్ విద్యార్థి కూడా పరీక్షకు హాజరయ్యాడు. రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి మొత్తం 235 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.