న్యూఢిల్లీ: వైద్యుల పదవీ విరమణ వయస్సును పెంచే అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీ ఏర్పాటు నిర్ణయానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లభించిందని తెలిపింది.

హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, దాని పరిధిలోని వైద్యుల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సేవల ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ డీన్, లోక్ నాయక్ హాస్పిటల్ ఎండీ తదితరులు ఉంటారు.