ఇక్కడి ఎన్టీఆర్ స్టేడియంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథుని 45వ రథయాత్రలో ఆయన పాల్గొన్నారు.

ఇస్కాన్ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిందని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘నా ప్రభుత్వం అందరి కోసం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మతాన్ని గౌరవిస్తుందని, అన్ని మతాలకు స్వేచ్ఛను, అవకాశాలను కల్పించిందని అన్నారు.

ఇస్కాన్ ప్రార్థనలతో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. “మానవ సేవే పరమావధి అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది’’ అని అన్నారు.

ఇలాంటి మతపరమైన కార్యక్రమాలు సమాజంలో మార్పు తీసుకువస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు.

అబిడ్స్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌ ఆధ్వర్యంలో రథయాత్ర సాగింది. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు రథయాత్ర సాగింది.

ముఖ్యమంత్రి ప్రార్థనలు చేసి వివిధ పూజల్లో పాల్గొన్నారు.