ఎల్లమ్మకుంట శివారులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలిని కామారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన లలితగా గుర్తించారు. ఆమె భర్త ప్రభాకర్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో చిరుతపులి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

2023 ఫిబ్రవరిలో చాంద్రాయణపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది.

2022 సెప్టెంబరులో, దగ్గి అటవీ ప్రాంతంలోని 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత చనిపోయింది.

పెరుగుతున్న మానవ-జంతు ఘర్షణల కారణంగా రోడ్డు, రైలు ప్రమాదాల్లో చిరుతలు మృత్యువాత పడుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడవుల గుండా వెళ్లే హైవేలపై వాహనాల వేగాన్ని నియంత్రించాలని జంతు సంరక్షణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. జంతువుల కోసం అడవుల్లో అండర్‌పాస్‌లు, వంతెనలు నిర్మించాలని సూచించారు.