నరగుంద ఎమ్మెల్యే పాటిల్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రోడ్‌వేస్‌ డ్రైవర్లు, కండక్టర్లకు జీతాలు ఇవ్వడం లేదని, శాసనసభ్యులకు కూడా రెండు, మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ఖజానా ఖాళీ అయిందని, రాష్ట్రం గురించి గొప్పగా మాట్లాడే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం తీసుకురావాలని ఆయన అన్నారు.

పేదలకు భరోసా పథకం అందించడంలో తమ బీజేపీ నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే ఈ విషయంలో తాము (కాంగ్రెస్‌) చేసే ఖర్చుల గురించి పక్కాగా ప్లాన్ చేసి ఉండాలన్నారు.

"ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్థవంతమైన ఆర్థిక మంత్రి. అధికారం కోసం ఎందుకు అంత రాజీ పడ్డారో నాకు తెలియదు" అని ఆయన పేర్కొన్నారు.

కర్ణాటకలో 23 నుంచి 24 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని పాటిల్‌ చెప్పారు.